కరోనా... కరీనా... బోలెడన్ని జాగ్రత్తలు!

15 Apr, 2021 03:30 IST|Sakshi

కంటికి కనిపించని కరోనాతో ప్రపంచం పోరాడుతోంది. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూనే కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నాం. ముఖ్యంగా సినిమా షూటింగ్‌ అంటే చాలామంది ఉంటారు కాబట్టి జాగ్రత్తలు కూడా భారీగానే ఉంటాయి. ఇదే విషయం గురించి ఆమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ –‘‘కరోనా లాక్‌డౌన్‌ తర్వాత మా ‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్‌ ఆరంభించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తగా షూటింగ్‌ చేశాం.

అదే సమయంలో చిత్రకథానాయిక కరీనా కపూర్‌ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్‌ అయింది. ప్రపంచం మొత్తం కరోనాను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే మేం కరోనాతో పాటు కరీనా కోసం కూడా బోలెడన్ని జాగ్రత్తలు తీసుకున్నాం (నవ్వుతూ)’’ అన్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణ పూర్తి చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఈ ఏడాది క్రిస్మస్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. హాలీవుడ్‌ సినిమా ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు