మాజీ భార్యతో కాకినాడ చేరుకున్న ఆమిర్‌ ఖాన్‌

13 Aug, 2021 12:27 IST|Sakshi

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్ర బృందం తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చేరుకుంది, బుధవారం అర్థరాత్రి ఆమిర్‌తో పాటు ఆయన మాజీ భార్య కిరణ్‌ రావు, లాల్‌సింగ్‌ చద్దా మూవీ టీం ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. కాకినాడ- ఉప్పాడ, బీచ్‌, పోర్టు, అమలాపురం సమీపంలో ఓడలరేవు బీచ్‌, ఇతర ప్రముఖ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ జరగనుంది. ఇక్కడ ఆమిర్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

ఇప్పటికే కార్గిల్, లడఖ్, శ్రీనగర్‌ లొకేషన్స్‌లో ఈ మూవీ షూటింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన చిత్రీకరణ టాలీవుడ్‌ హీరో నాగచైతన్య ఇటివల తన షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాడు. ఇందులో చైతూ బాల అనే ఆర్మి ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఆస్కార్‌ అవార్డు విన్నింగ్‌ ఫిల్మ్, హాలీవుడ్‌ కల్ట్‌ క్లాసిక్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’ చిత్రానికి హిందీ రీమేక్‌గా తెరకెక్కుతున్న  ‘లాల్‌సింగ్‌ చద్దా’ను  ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాడు. ఇందులో ఆమిర్‌కు జోడిగా కరీనా కపూర్‌ నటిస్తోంది. 105 కోట్ల బడ్జెతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. మోనా సింగ్, యోగి బాబు తదితర నటీనటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. 

మరిన్ని వార్తలు