Chiranjeevi-AAmir Khan: ‘గాడ్‌ ఫాదర్‌’లో నన్ను కాదని సల్మాన్‌ను ఎందుకు తీసుకున్నారు’ చిరును ప్రశ్నించిన ఆమిర్‌

25 Jul, 2022 18:16 IST|Sakshi

బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. హాలీవుడ్‌ మూవీ 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ గుడ్‌ బాయ్‌ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అద్వైత్ చందన్‌ దర్శకత్వం వహించారు.  చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను ఆదివారం చిరంజీవి లాంచ్‌ చేశారు.

చదవండి: క‌ద‌ల‌లేని స్థితిలో కైకాల‌, బెడ్‌పైనే కేక్ క‌ట్ చేయించిన చిరు.. ఫొటోలు వైరల్‌

ఈ సందర్భంగా తెలుగు డైరెక్టర్లపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే ‘గాడ్‌ ఫాదర్‌’ మూవీలో తనని కాకుండా సల్మాన్‌ ఖాన్‌ను తీసుకోవడంపై చిరును ప్రశ్నించిన విషయాన్ని ఆమిర్‌ ఈ సందర్భందగా గుర్తు చేసుకున్నాడు. అయితే గతంలో చిరంజీవి తనని తెలుగు సినిమాల్లో నటించాలని ఉందా? అడిగినట్లు చెప్పారని, అయితే దానికి తాను ‘మీ సినిమాలో నటించాలని ఉంది’ అని చెప్పడంతో  తప్పకుండా అవకాశం ఇస్తానని చిరంజీవి చెప్పారన్నారు.

చదవండి: ‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్‌

కానీ ‘గాఢ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్‌ను తీసుకున్నామని చిరంజీవి తనకు తర్వాత ఫోన్ చేసి చెప్పగా.. దానికి తాను ‘నన్ను కాకుండా సల్మాన్‌ను ఎందుకు తీసుకున్నారు’ అని అడిగినట్టు చెప్పారు. అందుకు చిరంజీవి... ఇది హృదయం, బుద్ధిబలానికి సంబంధించిన పాత్ర కాదని, కండబలానికి ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో సల్మాన్‌ను ఎంపిక చేసుకున్నామని చిరు వివరించారని ఆమిర్ చెప్పుకొచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వార్తలు