Aamir Khan: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్‌ ఖాన్‌ ఆవేదన

1 Aug, 2022 15:11 IST|Sakshi

Aamir Khan Reacts To  Boycott  Laal Singh Chaddha Twitter Trend: బాలీవుడ్ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ ఖాన్‌, కరీనా కపూర్‌ మరోసారి జోడిగా నటించిన చిత్రం 'లాల్‌సింగ్‌ చద్దా'. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్టయిన 'ఫారెస్ట్‌ గంప్‌' మూవీకి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ గుడ్‌ బాయ్‌ నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ఇటీవల బాయ్‌కాట్‌ సెగ తగిలింది. 'లాల్ ‍సింగ్‌ చద్దా' సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం చేశారు. 

తాజాగా ఈ బాయ్‌కాట్‌ నిరసనపై అమీర్‌ ఖాన్ స్పందించాడు. తన చిత్రాన్ని ఎవరూ బహిష్కరించవద్దని కోరాడు. ''నాపై, నా సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది మనసుల్లో చాలా గట్టిగా నాటుకుపోయింది. అందుకు నాకు చాలా విచారంగా ఉంది. నేను నా దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు నేను చెప్పాల్సింది ఒక్కటే.. మీరు ఎంతో దృఢంగా నమ్ముతున్న ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. నా గురించి అలాంటి ప్రచారాలు జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి నా సినిమా చూడండి. బహిష్కరించవద్దు'' అని అమీర్‌ ఖాన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  
 

మరిన్ని వార్తలు