సోషల్‌ మీడియా ఖాతాల డియాక్టివేట్‌పై అమిర్‌ క్లారిటీ

17 Mar, 2021 16:22 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమిర్‌ ఖాన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ అకౌంట్‌లను డియాక్టివేట్‌ చేస్తూ తన మూవీలకు సంబంధించిన సమచారం ఆయన ప్రొడక్షన్‌ వెబ్‌సైట్‌, సోషల్‌ మీడియాల్లో చూడోచ్చని తెలిపాడు. దీంతో అమిర్‌ సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడంపై అభిమానులు, ఫాలోవర్స్‌ అంతా షాక్‌కు గురయ్యారు. అంతేగాక ఆయన సోషల్‌ మీడియాకు దురమవ్వడంపై రకరకా వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనే ఈ విషయంపై స్పందించాడు.

అమిర్‌ తాజా చిత్రం ‘కోయి‌ జానె నా’ మూవీ స్క్రీనింగ్‌కు వచ్చిన అమిర్‌ను మీడియా దీనిపై ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను సోషల్‌ మీడియాకు దూరమవడం పట్ల ఎవేవో ఊహించుకుని వారే కథలు అల్లుతున్నారు. ఇందులక్ష అంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే నేను సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండను. అంతేకాకుండా ఈ మధ్య మీడియానే చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇకపై నేను అభిమానులతో మాట్లాడాలనుకుంటే మీడియా ద్వారానే మాట్లతాను. అది మీకు(మీడియా) కూడా మంచిదే కదా. నేను పూర్తిగా మీడియాను నమ్ముతాను’ అంటూ తనదైన శైలిలో అమిర్‌ చెప్పుకొచ్చాడు. 

చదవండి: 
అమీర్‌ ఖాన్‌ నిర్ణయానికి అభిమానులు హర్టయ్యారు..

నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ.. కీలక పాత్రలో!

మరిన్ని వార్తలు