Aamir Khan: చెత్త ఆరోపణలను ఖండించిన లాల్‌సింగ్‌ చద్దా టీం

15 Jul, 2021 00:29 IST|Sakshi

ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. నాగచైతన్య ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ లడఖ్‌లో జరుగుతోంది. అక్కడి వాఖా గ్రామంలో చిత్రీకరణ జరిపినప్పుడు పరిసరాల్లో చెత్త వదిలేశారని ఆ నెటిజన్‌ ఆరోపించారు. ‘‘వాఖా గ్రామ ప్రజలకు ‘లాల్‌సింగ్‌ చద్దా’ టీమ్‌ ఇచ్చిన బహుమతి ఇది. ‘సత్యమేవ జయతే’ షోలో పర్యావరణం గురించి ఆమిర్‌ మాట్లాడుతుంటారు. కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి వేరేలా. ఈ ప్రదేశంలో షూటింగ్‌ చేశారు. కానీ వెళ్లేటప్పుడు పరిసరాలను శుభ్రం చేయించలేదు’’ అంటూ ఓ నెటిజన్‌ వీడియోను షేర్‌ చేశారు. ఆ వీడియోలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్, ఇంకా వేరే వస్తువులు ఉన్నాయి.

ఈ విషయంపై ఆమిర్‌ ఖాన్‌ ప్రొడక్షన్‌ సంస్థ ‘ఏకేపీ’ స్పందిస్తూ.. ‘‘లొకేషన్‌ని శుభ్రంగా ఉంచలేదనే ఆరోపణను ఖండిస్తున్నాం. స్థానిక అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా లొకేషన్‌కి వచ్చి చెక్‌ చేసుకోవచ్చు. షూటింగ్‌ జరుపుతున్న ప్రాంతంతో పాటు ఆ పరిసరాల్లో చెత్త లేకుండా చూసుకోవడానికి మాకు ఒక టీమ్‌ ఉంది. ప్యాకప్‌ చెప్పగానే మొత్తం లొకేషన్‌ అంతా శుభ్రంగా ఉందా? లేదా అని చెక్‌ చేస్తాం. అలాగే షెడ్యూల్‌ మొత్తం పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు మొత్తం శుభ్రంగా ఉందా? లేదా అని చూసుకుంటాం’’ అని పేర్కొంది. ఈ స్టేట్‌మెంట్‌కి ఆ నెటిజన్‌ స్పందిస్తూ – ‘‘ఎవర్నీ కించపరచాలని కాదు. లడఖ్‌ పర్యావరణాన్ని కాపాడాలన్నదే మా ఉద్దేశం. షూటింగ్‌ చూడ్డానికి లొకేషన్‌కి వెళ్లిన చాలామంది ఎంతో విచారంగా తిరిగొచ్చారు. పైగా లొకేషన్‌ ఎలా ఉందో చెప్పడానికి నేను పోస్ట్‌ చేసిన వీడియోనే ఆధారం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు