Atrangi Re Casting: హీరోహీరోయిన్లకు మధ్య 28 ఏళ్ల గ్యాప్‌! స్పందించిన డైరెక్టర్‌

25 Nov, 2021 16:54 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌, అందాల తార సారా అలీఖాన్‌ కలిసి నటించిన చిత్రం ఆత్రంగి రే. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజవగా నటీనటుల వయసు తేడాపై విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి 2018లో సారా ఇండస్ట్రీలో అడుగుపెట్టేనాటికి ఆమె వయసు 26. ధనుష్‌ 2002లో నటనారంగంలో ఎంట్రీ ఇచ్చే సమయానికి అతడి వయసు 38 ఏళ్లు. 1991లో కెరీర్‌ ఆరంభించిన అక్షయ్‌ కుమార్‌ ఈ సెప్టెంబర్‌లో 54వ పుట్టినరోజు జరుపుకున్నాడు. తనకంటే 25-28 ఏళ్ల వ్యత్యాసం ఉన్న హీరోల సరసన సారా నటించడంపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

తాజాగా దీనిపై ఆత్రంగి రే డైరెక్టర్‌ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ స్పందించాడు. 'ఆత్రంగి అంటే విచిత్రం అని అర్థం. సినిమా తీయడంలో దర్శకుడు ఎంత ఓపికగా ఉంటాడో, ఆ నటీనటులను ఎందుకు ఎంపిక చేసుకున్నాడో తెలుసుకోవడానికి ప్రేక్షకులు వెయిట్‌ చేస్తుంటారని ఫిల్మ్‌ మేకర్‌ భావిస్తాడు. మనుషులను అంచనా వేయడం మనకు అలవాటు. ప్రజలు రెండు గంటలపాటు సినిమా చూసి ఆ తర్వాత స్పందించాలని కోరుకుంటున్నాను 'అని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్లు చూసి బాధపడటం లేదన్న ఆనంద్‌ తన జయాపజాయల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నానని పేర్కొన్నాడు.

కాగా ఆనంద్‌ తను వెడ్స్‌ మను: రిటర్న్స్‌, రంజానా వంటి హిట్‌ చిత్రాలను అందించాడు. షారుఖ్‌ ఖాన్‌, అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌తో కలిసి తీసిన జీరో డిజాస్టర్‌గా నిలిచింది. ఆత్రంగి రే సినిమా డిసెంబర్‌ 24న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రిలీజవుతోంది.

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

మరిన్ని వార్తలు