గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి

7 Jun, 2021 09:39 IST|Sakshi

చిరంజీవి నటించిన ‘ఆపద్బాంధవుడు’ సినిమా గుర్తుంది కదా.. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1992లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి సరసన మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా నటించింది. 18 ఏళ్ల వయసులో మిస్‌ ఇండియా టైటిల్‌ సొంతం చేసుకొని పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఆపద్బాంధవుడు ముందు మీనాక్షిఅంతకుముందే తెలుగులో ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ అనే సినిమా చేసినా ఆమెకు  అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘ఆపద్బాంధవుడు’తో తెలుగులో ఒక్కసారిగా బాగా పాపులర్‌ అయింది. చూడచక్కని రూపం, అమాయకపు హావభావాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకొని అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పింది.

బాలీవుడ్‌లో మరోసారి చిరంజీవి సరసన గ్యాంగ్‌లీడర్‌ రీమేక్‌ చిత్రం ఆజ్ కా గూండారాజ్ సినిమాలోనూ నటించింది. అలా బాలీవుడ్‌లో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది మీనాక్షి. అయితే 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది. ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడిపేస్తుంది. కాగా తాజాగా ఆమెకు సంబంధించి లేటెస్ట్‌ ఫోటోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం 57 ఏళ్ల మీనాక్షి ముఖంలో కళ తప్పిపోయి వయసు మళ్లిన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు అసలు ఈమె మీనాక్షి యేనా అని ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ఎంతో అందంగా ఉన్న  మీనాక్షి ఇలా అయ్యిందేంటి అని షాకవుతున్నారు. 

 


 

చదవండి : 'మన్మథుడు' హీరోయిన్‌ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు