రెండో భర్త మీద ఆరోపణలు: వీడియో రిలీజ్‌ చేసిన అభినవ్‌ కోహ్లి

11 May, 2021 14:32 IST|Sakshi

బాలీవుడ్‌ నటి శ్వేతా తివారి 2013లో అభినవ్‌ కోహ్లిని రెండో పెళ్లి చేసు​కుంది. వీరికి రియాన్ష్‌ అనే కొడుకున్నాడు. కొన్నేళ్లు బాగానే సాగిన వీరి సంసార సాగరం అర్ధాంతరంగా బీటలు వారింది. దీంతో 2019లో వీరు విడిపోయారు. కానీ కొడుకు రియాన్ష్‌ కోసం ఇద్దరూ  గొడవ పడ్డారు. అతడు తనకు చెందుతాడంటే తనకంటూ వాదులాటకు దిగారు. ఈ గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని చెప్తూ శ్వేతా తివారీ సీసీటీవీ ఫుటేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో రిలీజ్‌ చేసింది. ఇందులో శ్వేతా కొడుకును భుజాన ఎత్తుకుని నడుస్తూ ఉండగా.. కోహ్లి బలవంతంగా పిల్లవాడిని లాక్కున్నట్లుగా కనిపిస్తోంది.

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

అయితే అతడు బలవంతంగా తన కొడుకును తీసుకున్నాడని, ఈ క్రమంలో అతడి చేతికి గాయం అయిందని చెప్పుకొచ్చింది. ఈ ఘటనతో రియాన్ష్‌ చాలా భయపడిపోయాడని, ఆ భయం నుంచి బయటపడేందుకు సుమారు నెల రోజులు పట్టిందని తెలిపింది. ఆ సమయంలో కనీసం రాత్రిళ్లు సరిగా నిద్రకూడా పోలేదని వాపోయింది. ఇప్పటికీ తన తండ్రి ఇంటికి వస్తున్నాడంటే గజగజ వణికిపోతున్నాడని పేర్కొంది. ఇలాంటి మానసిక స్థితిలో తన కొడుకును చూడలేకపోతున్నాని, అతడికి ప్రశాంత వాతావరణంలో సంతోషంగా చూసుకోవాలనుందని చెప్పింది. కానీ ఈ భయంకరమైన వ్యక్తి తన కొడుకును ప్రశాంతంగా ఉంచండని మండిపడింది. దీన్ని శారీరకంగా హింసించడం అనకపోతే ఇంకేమంటారు? అని శ్వేతా ప్రశ్నించింది.

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024)

ఇది చూసిన అభినవ్‌ కోహ్లి.. శ్వేతా తివారి ఆరోపణలను తోసిపుచ్చాడు. గతేడాది శ్వేతాకు కరోనా వచ్చినప్పటి నుంచి రియాన్ష్‌ తన దగ్గరే ఉండిపోవాలనుకుంటున్నాడని చెప్పాడు. అందుకు ఇదే సాక్ష్యమంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు. ఇందులో ఆ బాలుడు అమ్మ దగ్గరకు వెళ్లనని చెప్తున్నట్లుగా ఉంది. ఇక ఈ వీడియోకు 'ఇప్పటికైనా నిజాన్ని బయటకు రానివ్వండి' అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

చదవండి: నా మొదటి భర్త నన్ను కొట్టడం నా కూతురు చూసింది: నటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు