నాపై వాలే ఒక్క నవ్వు చాలే!

1 Nov, 2022 03:33 IST|Sakshi
యశ్‌రాజ్, శివ నిర్వాణ, శ్రీనివాసులు

యష్‌రాజ్, నవమి గాయక్‌ జంటగా రామ కృష్ణార్జున్‌ దర్శకత్వంలో జింకా శ్రీనివాసులు నిర్మించిన చిత్రం ‘అభిరామ్‌’. మీనాక్షీ భుజంగ్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘చాలే చాలే ఇంకా చాలే.. నాపై వాలే ఒక్క నవ్వు చాలే’ అంటూ సాగే పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా ఉంది.

సంగీత దర్శకుడు మీనాక్షీ భుజంగ్‌ ఈ పాటను పాడటం బాగుంది. కిరణ్‌ కొరియోగ్రఫీ, సాగర్‌ నారాయణ లిరిక్స్‌ బాగున్నాయి. ఈ సినిమా యూనిట్‌కి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు రామకృష్ణార్జున్‌. ‘‘లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్‌ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు జింకా శ్రీనివాసులు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌:ఉల్లగంటి ప్రసాద్‌.

మరిన్ని వార్తలు