RECCE 360 Teaser: రెక్కీ 360 టీజర్‌ చూశారా?

2 Jul, 2022 20:21 IST|Sakshi

అభిరామ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం రెక్కీ 360. "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనేది ట్యాగ్ లైన్‌. క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణలో స్నోబాల్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా కమలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే శనివారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. కేవలం 54 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ రేపుతోంది. క్రైం నేపథ్యంలో సాగే ఈ కథలో ఊహించని ట్విస్టులు ఉంటాయని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని మేకర్స్ పేర్కొన్నారు. రెక్కీ 360 చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

చదవండి: దయచేసి నాకు నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి: నటి విజ్ఞప్తి
విజయ్‌ దేవరకొండ నగ్నంగా కనిపించడానికి కారణమిదే!

మరిన్ని వార్తలు