​అభిషేక్‌ బచ్చన్‌ ట్వీట్‌: ఆయన కన్నా గొప్ప నటుడు ఎవరూ లేరు

9 May, 2021 11:24 IST|Sakshi

ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బిగ్‌ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టున పరంగా ఆయన గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి ఉన్న‌త స్థానంలో ఉండే నటులో అమితాబ్ బ‌చ్చ‌న్ ఒక‌రని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయ‌న వార‌సుడిగా అభిషేక్ బచ్చన్‌ బాలీవుడ్‌ పరిశ్రమలో ఎంట్రీ  ఇచ్చి చాలా కాలం గడిచినప్పటికీ అతని కెరీర్ అంత సాఫీగా సాగ‌డం లేదనే చెప్పాలి. అభిషేక్‌ బచ్చన్‌ నటించిన సినిమాల పరంగా ఎక్కువగా నెటిజన్ల ట్రోలింగ్‌కు గరైయ్యేవాడు కానీ ఈ సారి మాత్రం ప్రశంసలు అందుకున్నాడు.

నటన పరంగా బిగ్‌ బి మించిన వారు లేరు 
స్టాక్‌ మార్కెట్‌ను గతంలో ఒక ఊపు ఊపిన  హర్షద్‌ మెహతా జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘ది బిగ్ బుల్’ ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్‌ కీలక పాత్రంలో నటించాడు. అందులో అభిషేక్‌ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజ‌న్ అంద‌రికి ఆశ్చ‌ర్యం క‌లిగించేలా ట్వీట్ చేశారు. ‘అభిషేక్.. మీ బిగ్ బుల్ చిత్రం చూశాను. ఇందులో మీ న‌ట‌న మీ తండ్రి అమితాబ్ బ‌చ్చ‌న్ కన్నా గొప్ప‌గా ఉందంటూ’ కామెంట్ పెట్టాడు. దీనికి స్పందించిన అభిషేక్.. మీ ప్ర‌శంస‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఆయన కన్నా గొప్ప న‌టులు ఎవ‌రు లేరంటూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఎదో అడపాదడపా హిట్స్  తప్ప తండ్రికి ఉన్న స్టార్‌ ఇమేజ్‌ను అందుకోలేక పోతున్నాడని బాలీవుడ్‌లో అభిషేక్‌పై బహిరంగానే విమర్శలు వినిపించేవి. అదీ కాక ఆయన నటించిన సినిమాలు విజయాల క‌న్నా అపజయాలే ఎక్కువ ఉండ‌డంతో  నెటిజ‌న్స్ నుంచి ట్రోలింగ్ కూడా ఎక్కువగానే వచ్చేవి. 

( చదవండి: ప్రియురాలితో ఎయిర్‌పోర్టులో రాహుల్‌.. ఫోటోలు వైరల్‌ )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు