ఆస్పత్రిలో చేరిన అమితాబ్; కొడుకు క్లారిటీ:

27 Oct, 2020 16:04 IST|Sakshi

తనపై సోషల్‌ మీడియాలో ఎన్ని ట్రోల్స్‌ చేసినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్. ట్రోల్స్‌పై ఆగ్రహానికి లోనవకుండా చాకచక్యంగా బదులిస్తారు. ఈ క్రమంలో  బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇటీవల బిగ్‌బీ అనారోగ్యానికి గురయ్యారని, అమితాబ్‌ బచ్చన్‌కు గాయం అవ్వడం వల్ల  ఆసుపత్రిలో చేరారని సోమవారం నాడు కొన్ని వార్తలు వెలువడ్డాయి. శనివారం నుంచి ఆస్పత్రిలోనే అక్కడే ఉన్నట్లు, ప్రస్తుతం వైద్యులచేత చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయం తెలియడంతో  అభిమానులు కొంచెం కంగారు పడిపోయారు. అయితే బచ్చన్‌ కుంటుంబం నుంచి అయితే దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి: సోషల్‌ మీడియా ట్రోల్స్‌: అభిషేక్‌ స్పందన

తాజాగా తండ్రి ఆరోగ్యంపై ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ స్పందించారు. బిగ్‌బీ అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. అమితాబ్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.. నేను కూడా అడుగతాను. ఎందుకంటే నాన్న నా ముందే కూర్చొని ఉన్నారు.  ఆసుపత్రిలో ఉన్నది ఖచ్చితంగా నాన్న డూప్లికేట్‌ అయ్యి ఉంటారు. అని పేర్కొన్నారు. కాగా జులైలో అమితాబ్‌ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బిగ్‌బీతోపాటు, అభిషేక్‌, ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య కరోనా పాటిజివ్‌గా తేలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 20 రోజుల చికిత్స అనంతరం మెల్లమెల్లగా అందరూ కోలుకున్నారు. ఇక అభిషేక్‌ చివరగా బ్రీత్:‌ ఇంటూ ది షాడోస్‌లో కనిపించారు. అదే విధంగా ఆయన నటించిన ‘బిగ్‌బుల్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి: బిగ్‌బీ పోస్టుకు కత్రినా కైఫ్‌ ఫ్యాన్స్‌ ఫిదా!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా