అభిషేక్ బచ్చన్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ అమ్మకం.. ధర ఎంతంటే?

12 Aug, 2021 22:11 IST|Sakshi

ముంబై: అభిషేక్ బచ్చన్ ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించాడు. దీని​ అమ్మకం ద్వారా ఆయనకు రూ. 45.75 కోట్లు వచ్చాయి. మనీ కంట్రోల్‌ నివేదిక ప్రకారం.. ముంబైలోని వర్లి ప్రాంతంలో ఒబెరాయ్ 360 అపార్టుమెంట్‌ పడమరలో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి  ఉంది. అభిషేక్‌ బచ్చన్‌ ఈ ఇంటిని 2014లో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

కాగా అదే బిల్డింగ్‌లో షాహిద్ తన అపార్ట్‌మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అంతే కాకుండా రాణి ముఖర్జీ, దిశా పటానీ ఖార్ వెస్ట్ పరిసరాల్లో సముద్ర ముఖంగా ఉన్న గృహాలను కొనుగోలు చేశారు. రాణి ముఖర్జీ దీనికోసం రూ.7.12 కోట్లు ఖర్చు చేయగా.. దిశా పటానీ రూ.5.95 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇక అభిషేక్ చివరిసారిగా ది బిగ్ బుల్‌లో కనిపించాడు. ఇది వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా హన్సల్ మెహతా హిట్ సిరీస్‌తో పోల్చితే బాగా ఆడలేదనే చెప్పాలి. ఆయన తదుపరి రెండు చిత్రాలు నిమ్రత్ కౌర్‌తో దాస్వి, చిత్రాంగద సేన్‌తో బాబ్ బిశ్వాస్ సిమాలు విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా ఐశ్వర్య చివరిసారిగా అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావుతో కలిసి ఫన్నీ ఖాన్‌ సినిమాలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి తమిళ నవల ఆధారంగా తెరకెక్కనున్న పీరియడ్ ఇతిహాసం.  

మరిన్ని వార్తలు