బిగ్‌ బీ మనవడి బర్త్‌ డే.. అభిషేక్‌ బచ్చన్‌ ఎలా విష్‌ చేసాడో తెలుసా

23 Nov, 2021 13:33 IST|Sakshi

Abhishek Bachchan Wishes To Agastya Nanda On His Birthday: బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్య నందా మంగళవారం (నవంబర్‌ 23)న 21వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగస్త్యకు అతని సోదరి నవ్య నవేలి, మేనమామ అభిషేక్‌ బచ్చన్‌ బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. పూజలో కూర్చున్న అగస్త్య చిన్ననాటి ఫొటోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేశారు అభిషేక్‌ బచ్చన్‌. అందులో  '21వ హ్యాపీ బర్త్‌ డే అగస్త్య. దయ, ప్రేమ, కేరింగ్‌, బాధ్యాయుతమైన మనిషిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నువ‍్వు అధికారికంగా పెద్దవాడివి. దయచేసి ఇకనైనా ఈ మామ బట్టలు, షూ వేసుకోకు. నీవే సొంతగా కొనుక్కో. లవ్‌ యూ'. అంటూ పోస్ట్ చేశారు. 

A post shared by Abhishek Bachchan (@bachchan)అలాగే అగస్త్య సోదరి నవ్య నవేలి నందా తన సోదరుడికి సోషల్‌ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరూ కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ ' 21 ఏళ్లుగా నువ్‌ నా గదిలోకి వచ్చి, నావైపు మౌనంగా చూసి వెళ్లి పోతావు'. రాసుకొచ్చింది. అలాగే అగస్త్య తల్లి శ్వేత బచ్చన్‌ కూడా తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఖుషీ కపూర్‌, సుహానా ఖాన్‌లతో జోయా అక‍్తర్‌ తర్వాతి చిత్రంలో అగస్త్య సినిమాల్లోకి అడుగుపెడతాడని గతంలో పుకార్లు వచ్చాయి. సెప్టెంబర్‌లో జోయా కార్యాలయం బయట ఈ ముగ్గురు కనిపించడం గమనార్హం. 

A post shared by Navya Naveli Nanda (@navyananda)

A post shared by S (@shwetabachchan)

మరిన్ని వార్తలు