కథ చాలా నచ్చింది

4 Dec, 2020 06:26 IST|Sakshi
అనన్య, లలిత్‌ ఆదిత్య, రాకేష్‌ వర్రే

– అనన్య

‘యాక్టింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌’ ఏర్పాటు చేసి ఎంతో మంది నటీనటులను సినీ పరిశ్రమకు అందించిన యాక్టింగ్‌ గురు మహేశ్‌ గంగిమల్ల ప్రొడక్షన్‌ రంగంలో అడుగుపెట్టారు. అభినయ జ్ఞాపిక ప్రొడక్షన్‌ అనే బ్యానర్‌ను స్థాపించి, స్వీయ దర్శకత్వంలో ‘అభివ్యక్తి’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు మహేశ్‌ గంగిమల్ల. అజగవా ఆర్ట్స్‌ నిర్మాత భూపాల్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో రాకేశ్‌ వర్రే క్లాప్‌ కొట్టారు. దర్శకుడు మాధవ్‌ కోదాడ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రంలో లలిత్‌ ఆదిత్య, ‘మల్లేశం’ ఫేమ్‌ అనన్య నాగళ్ల, సాయి రాఘవేంద్ర, సుందర్, రమణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్‌ విన్నప్పటినుంచి షూటింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా. అంత బాగా నచ్చింది. మా యాక్టింగ్‌ గురువే దర్శకుడు అవడం మాకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘జనవరిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నాం. ఇందులో నా స్టూడెంట్స్‌తో పాటు కొత్తవారు నటిస్తారు’’ అని మహేశ్‌ గంగిమల్ల తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జైపాల్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా