Acharya:‘ధర్మస్థలి’ కోసం కోట్లు ఖర్చుపెట్టాం.. పూజలు కూడా చేశాం

24 Apr, 2022 16:09 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా కోసం 20 ఎకరాల్లో భారీ టెంపుల్‌ సెట్‌ వేసిన విషయం తెలిసిందే. దానికి ‘ధర్మస్థలి’అని నామకరణం చేశారు. సినిమాలోని సింహభాగం ఇక్కడే షూటింగ్‌ చేశారట. ‘ధర్మస్థలి’ ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్‌ అని మొదటి నుంచి ప్రచారం చేస్తోంది చిత్ర యూనిట్‌. తాజాగా ‘ధర్మస్థలి’ ఎలా సృష్టించారో చెప్పారు దర్శకుడు కొరటాల శివ.

‘సినిమా అనుకున్నపుడే.. ఓ మంచి టెంపుల్‌ టౌన్‌ కావాలనుకున్నాం. చాలా ప్రాంతాలు తిరిగాం. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు నచ్చాయి.షూటింగ్‌ కాధ్యం కాదేమో అనిపించింది. చివరకు మేమే ‘ధర్మస్థలి’సృష్టించాలనుకున్నాం. ‘ధర్మం’గురించి చెప్పే కథ కాబట్టి ఆ టౌన్‌ పేరు కూడా ధర్మస్థలి అని పేరు పెట్టాం. ఆ పేరు మా టీమ్‌ మొత్తానికి నచ్చింది. నిర్మాతలు కూడా ఓకే అన్నారు.

(చదవండి: చరణ్‌కు ఉపాసన అంటే భయమా ? నాన్న అంటే భయమా ?..)

దీంతో మా ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ ఎన్నో దేవాలయాలను సందర్శించి, పరిశోధన చేసి సెట్‌ నిర్మించారు. ఆ సమయంలో మేము పూజలు కూడా చేశాం. దేవాలయాల పవిత్రత దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ‘ధర్మస్థలి’ ఎక్కడ ఉంది? అక్కడి వెళ్దాం అనే అభిప్రాయం అందరిలో వస్తుంది. అదొక అందమైన ప్రదేశం. కోట్ల రూపాయలను ఖర్చు చేసి 20 ఎకరాల్లో సెట్‌ని నిర్మించాం’అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.  మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

మరిన్ని వార్తలు