కరోనా దెబ్బకు వెనకడుగు వేస్తున్న మెగాస్టార్‌

12 Apr, 2021 15:01 IST|Sakshi

సెకండ్‌ వేవ్‌లో విజృంభిస్తున్న కరోనా దెబ్బకు పలు సినిమాలు రిలీజ్‌ను వాయిదా వేసుకుంటున్నాయి. ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన నాగచైతన్య, సాయిపల్లవిల 'లవ్‌స్టోరీ' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' సినిమా కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా టెన్షన్‌తో మెగా అభిమానులందరు థియేటర్‌కు వచ్చే అవకాశాలు లేకపోవచ్చని, కాబట్టి వాయిదా వేయడమే బెటర్‌ అనుకుంటున్నట్లు సమాచారం.

దీంతో మే 13న విడుదల కావాల్సిన ఆచార్య సరిగ్గా ఆ తేదీకి థియేటర్లలోకి రాకపోవచ్చని అంటున్నారు. షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం జూన్‌ 18న విడుదల కానున్నట్లు ఫిల్మీదునియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

కాగా 'ఆచార్య'లో మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. చిరుకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌, చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. సోనూసూద్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: 'ఆచార్య' షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న రామ్‌చరణ్‌

శత్రుసంహారానికి ఆచార్య సిద్ధం!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు