Acharya Second Single: ఆకట్టుకుంటున్న ‘నీలాంబరి’ ప్రోమో సాంగ్‌

4 Nov, 2021 11:24 IST|Sakshi

Acharya Movie Second Single Promo Out: మెగాస్టార్‌ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చెర్రికి జోడిగా పూజ హెగ్దే నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌లో నిరంజన్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ ప్రోమోను వదిలారు మేకర్స్‌.

చదవండి: మెగా ఇంట్లో దీపావళి సంబరాలు, ఫొటో షేర్‌ చేసిన బన్నీ

ఈ సందర్భంగా రేపు ఉదయం 11. 7 గంటలకు ఫుల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ‘నీలాంబ‌రి’ అంటూ సాగే ఈ పాట‌లో రామ్ చ‌ర‌ణ్ త‌న డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ సినిమాలో చరణ్‌ సిద్ధ అనే నక్సలైట్‌గా నటిస్తుండగా.. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా కనిపించనుంది. ఇందులో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్‌ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథ ఇది.

చదవండి: దీపావళి ముందే వచ్చింది.. లాలా భీమ్లా అదరగొట్టిందంతే..

మరిన్ని వార్తలు