శుభవార్త చెప్పిన సోనూసూద్‌

23 Apr, 2021 16:46 IST|Sakshi

సోనూ సూద్‌కు కరోనా నెగిటివ్‌ 

ఆక్సిజన్, రెమిడెసివిర్, బెడ్స్‌ ఈ మూడు మాటలే వినిపిస్తున్నాయి

దేశభక్తి చాటుకునేందుకు ఇదే మంచి సమయం

సాక్షి, ముంబై:  కరోనా కాలంలో రియల్‌ హీరోగా అవతరించిన అపర దానకర్ణుడు, నటుడు సోనూసూద్‌  తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఇటీవల కరోనా మహమ్మారి బారిన ఆయనకు తాజా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీంతో తమ హీరో త్వరగా కోలుకోవాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులు, ఫాలోవర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారి పట్ల  శరవేగంగా  స్పందించే ఆపద్భాంధవుడు సురక్షితంగా ఉన్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

‘‘ఆక్సిజన్, రెమిడెసివిర్, బెడ్స్‌’’ ఉదయం లేచిన దగ్గర్నుంచీ, అర్ధరాత్రి నుండి మరుసటి ఉదయం వరకు ఈ 3 పదాలే తనకు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కొన్నిసార్లు పాస్ అవుతున్నా, మరి కొన్నిసార్లు విఫలమవుతున్నా..అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను. దేవుడు అందరినీ చల్లగా చూడాలంటూ సోనూ ట్వీట్‌ చేశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అంతేకాదు  ఆగస్టు 15 న దేశభక్తిని చూపించే వారికి ఒక గొప్ప  సందేశాన్ని కూడా ఇచ్చారు. దేశం కోసం ఏదైనా చేయటానికి , దేశభక్తిని చూపించడానికి ఇంతకు మించిన సమయం లేదు స్పందించాలంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా ఇటీవల కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సోనూ సూద్‌, భయపడకండి..మరింత సేవ చేసేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందంటూ వ్యాఖ్యానించడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. చెప్పడమే కాదు చేసిన చూపిస్తున్నారు కూడా. సోనూ ట్విటర్‌ టైమ్‌లైన్‌ను పరిశీలిస్తే బాధితుల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు, చేస్తున్న సహాయ సహకారాలు అవగతమవుతాయి.  (సోనూసూద్‌కు కరోనా పాజిటివ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు