Nallamala Sucess Meet: నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చారు : బిగ్‌బాస్‌ ఫేం అమిత్‌

22 Mar, 2022 09:59 IST|Sakshi

‘‘గోవులను సంరక్షించుకోవాలనే సందేశాన్ని ‘నల్లమల’ సినిమా ద్వారా ప్రజలకు వివరించిన రవి చరణ్‌ని అభినందిస్తున్నాను. గో సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ‘నల్లమల’ లాంటి సందేశాత్మక సినిమాలు మరిన్ని రావాలి’’ అని ‘యుగతులసి ఫౌండేషన్‌’ చైర్మన్‌ కె.శివ కుమార్‌ అన్నారు. అమిత్‌ తివారీ, భానుశ్రీ జంటగా, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, ‘బాహుబలి’ ప్రభాకర్‌ ముఖ్య పాత్రల్లో రవి చరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నల్లమల’.

నమో క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌ఎమ్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో అమిత్‌ తివారి మాట్లాడుతూ– ‘‘క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న నన్ను నమ్మి హీరోగా అవకాశం ఇచ్చిన ఆర్‌ఎమ్‌కి థ్యాంక్స్‌. రెండున్నరేళ్ల మా కష్టానికి ‘నల్లమల’ విజయంతో తగిన ప్రతిఫలం దొరికింది’’ అన్నారు.

‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకి మా సినిమా నచ్చింది. నా మొదటి చిత్రానికే ఇంత ఆదరణ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు రవిచరణ్‌. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, పాటలు, సంగీతం: పి.ఆర్‌. 

మరిన్ని వార్తలు