Kamaal R Khan Arrest: వివాదాస్పద ట్వీట్‌.. బాలీవుడ్‌ నటుడు అరెస్ట్‌

30 Aug, 2022 12:15 IST|Sakshi

బాలీవుడ్‌ సినీ విమర్శకుడిగా పొరేందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్కే)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈరోజు(మంగళవారం) కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్‌-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ  వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు.

తనను తాను సినీ క్రిటిక్‌గా చెప్పుకునే రషీద్‌ ఖాన్‌.. సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, అమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ సమా టాప్‌ హీరోల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదమైంది.

'కొంతమంది ప్రముఖులను తీసుకెళ్లకుండా కరోనా వెళ్లదు. ఆ సమయంలో నేను పేర్లు చెప్పలేదు. కానీ నాకు తెలుసు.. ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌ లాంటి వాళ్లు చనిపోతారని. అంతేకాకుండా తర్వాత పైకి పోయేది ఎవరో కూడా నాకు తెలుసు' అంటే కేఆర్కే చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారాన్ని రేపింది.  దీనిపై కేసు నమోదవగా తాజాగా కేఆర్కేను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు