KRK Review On Brahmastra: ఈ సినిమా పెద్ద డిజాస్టర్.. కేఆర్కే సంచలన కామెంట్స్

18 Sep, 2022 18:33 IST|Sakshi

బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర‍్కే) బ్రహ్మాస్త్రపై  షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఇటీవల విడుదలైన రణ్‌బీర్ కపూర్‌, ఆలియా భట్ మూవీని తనదైన శైలిలో విమర్శించారు. ఎప్పుడూ వివాదాస‍్పద వ్యాఖ్యలతో వార్తల‍్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు.  బ్రహ్మస్త్ర ఒక పెద్ద డిజాస్టర్ అని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలకు తనను నిందించవద్దని నిర్మాత కరణ్ జోహార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.  

మరోసారి  సంచలన వ్యాఖ‍్యలతో ఒక్కసారిగా బాలీవుడ్‌ను షేక్ చేశారాయన. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద ఫెయిల్యూర్‌ అని అభివర్ణించారు. బాలీవుడ్‌లో ఇతర సినిమాల‍్లాగే ఇది కూడా పెద్ద  వైఫల్యమని చిత్రబృందానికి దిమ్మతిరిగే షాకిచ్చారు. 

కేఆర‍్కే సోషల్ మీడియాలో  స్పందిస‍్తూ ' అలియా భట్, రణబీర్ కపూర్‌ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నేను సమీక్ష చేయలేదు, అయినప్పటికీ ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లలేదు. అందుకే ఇదొక పెద్ద డిజాస్టర్. ఇతర బాలీవుడ్ నిర్మాతల్లాగే కరణ్‌ జోహార్ తన వైఫల్యానికి నన్ను నిందించరని ఆశిస్తున్నా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.  

కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్‌-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ నటులైన సల్మాన్‌ ఖాన్‌, అజయ్‌ దేవగన్‌, అమిర్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌ల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదమైంది. దీంతో కమల్‌ ఆర్‌ ఖాన్‌ (కేఆర్కే)ను గతంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు