నటుడికి సీరియస్‌.. 2 నెలల బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్లిన భార్య

1 May, 2021 19:47 IST|Sakshi

కోవిడ్‌ బంధాలను, ఆత్మీయులను దూరం చేస్తుంది. ముట్టుకుంటే వెంట వచ్చే మహమ్మారి కావడంతో ఆత్మీయులు ఎవరైనా కోవిడ్‌ బారిన పడిన వారి దగ్గరకు వెళ్లి ఓదార్చలేని పరిస్థితి. ఈ క్రమంలో ‘‘ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తన భర్త కోసం రెండు నెలల పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాను. నా జీవితంలో అత్యంత బాధకరమైన సందర్భం ఇదే అంటున్నారు’’ టీవీ నటుడు అనిరుధ్‌ దవే భార్య శుభి అహుజా. జీవితంలోనే అత్యంత క్లిష్ట సమయం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె చేసిన పోస్ట్‌ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. 

దీనిలో శుభి అహుజా ‘‘నా భర్త అనిరుధ్‌ దవే కోవిడ్‌ బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భోపాల్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో నేను ఆయన దగ్గర ఉండటం ఎంతో అవసరం. కానీ మాకు రెండు నెలల చిన్నారి ఉంది. తనను చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు. అటు అనురుధ్‌ను చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. నా జీవితంలోకెల్లా అత్యంత క్లిష్ట సమయం ఇదే. నా జీవితంలో అత్యంతక కఠినమైన సవాలు ఇదే. తప్పనిసరి పరిస్థితుల్లో నేను నా బిడ్డను ఇంట్లోనే వదిలి అనిరుధ్‌ దగ్గరకు వెళ్తున్నాను. నా బిడ్డ, భర్త క్షేమం కోసం ప్రార్థించాల్సిందిగా స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరిని కోరుతున్నాను. మీ ప్రార్థనలు నాకు ఇప్పుడు ఎంతో ముఖ్యం’’ అంటూ శుభి అహుజా అర్థించారు. 

ప్రస్తుతం ఈ పోస్ట్‌ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. మీ భర్త, చిన్నారి క్షేమంగా ఉంటారు.. ధైర్యంగా ఉండండి అంటూ మద్దతు తెలుపుతున్నారు అభిమానులు. ఇక అనురిధ్‌ దవే శక్తి - అస్తిత్వా కే ఎహ్సాన్‌కీ, వోహ్ రెహ్నే వాలి మెహ్లాన్‌కీ, వై.ఎ.ఆర్.ఓ కా తాషన్, బంధన్, లాక్‌డౌన్‌కీ లవ్ స్టోరీ వంటి టీవీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. 

చదవండి: సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు