సీరియ‌ల్ న‌టుడిపై 10 మంది దాడి

28 Jul, 2020 21:07 IST|Sakshi

న్యూఢిల్లీ: "దిల్‌తో హ్యాపీ హై జీ" సీరియ‌ల్‌ న‌టుడు అన్ష్ బ‌గ్రీపై శ‌నివారం గుర్తు తెలియ‌ని దుండ‌గులు దాడి చేశారు. దీంతో అత‌ని త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. దుండ‌గులు ఢిల్లీలోని త‌న ఇంటికి చేరుకుని మ‌రీ మూక‌దాడి చేసిన‌ట్లు ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. అయితే ఇది త‌న మాజీ కాంట్రాక్ట‌ర్ ప‌నేన‌ని ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. "ఇల్లు నిర్మించాల‌న్నది నా క‌ల. దీనికోసం గ‌తేడాదే ఓ కాంట్రాక్ట‌ర్‌ను మాట్లాడుకున్నాం. అయితే అత‌ను చెప్పిన గ‌డువుక‌ల్లా ఇంటి నిర్మాణం పూర్తిచేయ‌నందు వ‌ల్ల గతంలోనూ ఓసారి అత‌డిని హెచ్చ‌రించాను. త్వ‌ర‌గా ప‌నులు పూర్తి చేయాల‌ని కోరాను. అయిన‌ప్ప‌టికీ ఎప్పుడో పూర్త‌వాల్సిన నిర్మాణాన్ని సాగ‌దీస్తూ వ‌చ్చాడు. పైగా ఇల్లు పెండింగ్‌లో ఉండ‌గానే డ‌బ్బులు అడిగాడు. ప‌ని పూర్త‌య్యాకే ఇస్తాన‌ని క‌రాఖండిగా చెప్పాను. కానీ అత‌ను విన‌లేదు" (వాడి పళ్లు రాలగొడతా: సింగర్‌ సునీత)

"దీంతో ఇద్ద‌రిమ‌ధ్య మాటామాటా పెరగడంతో ఆ కాంట్రాక్ట‌ర్ మ‌ధ్య‌లోనే ప‌ని వ‌దిలేసి వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత‌ లాక్‌డౌన్‌లో నేను ముంబైలో ఉన్న స‌మ‌యంలో కాంట్రాక్ట‌ర్ నా త‌ల్లిని, చెల్లిని బెదిరించాడు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా కేసు కూడా న‌మోదు చేశారు.  వాళ్లు అత‌డికి వార్నింగ్ ఇచ్చి వ‌దిలేశారు. ప్ర‌స్తుతం కొత్త కాంట్రాక్ట‌ర్ నా ఇంటి నిర్మాణం చేప‌డుతున్నాడు. ఈ విష‌యం తెలిసి మాజీ కాంట్రాక్ట‌ర్ మ‌నుషుల‌ను పంపించాడు. జూలై 26న సుమారు ప‌ది మంది నాపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అక్క‌డున్న ఎవ‌రూ నాకు సాయం చేసేందుకు ముందుకు రాలేదు" అని అన్ష్ బ‌గ్రీ తెలిపారు. (నా కోసం కూడా అవార్డు కొనాలి కదా!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు