ప్రముఖ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ మృతి

9 Aug, 2021 08:04 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ (63) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్యలకు గత కొంతకాలంగా ఇంట్లోనే డయాలసిస్‌ చేయించుకుంటున్న ఆయన నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని సిటీ ఆస్పత్రిలో బర్బన్‌ గోరేగావ్‌లోని లైఫ్‌లైన్‌ ఆసుప్రతిలో చేరారు.

ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు అనుపమ్‌ స్నేహితుడు యశ్‌పాల్‌ శర్మ తెలిపారు. కాగా అనుపమ్‌ ‘మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’ వంటి పలు టీవీ సీరియల్స్‌తో పాటు స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌, బందిపోటు, క్వీన్‌ వంటి చిత్రాల్లో నటించారు. కాగా అనుపమ్‌ శ్యామ్‌ నటించిన ‘మన్‌ కీ ఆవాజ్‌ ప్రతిజ్ఞ’ సీరియల్‌లో ఠాకూర్‌ సజ్జన్‌ సింగ్‌ పాత్ర పోషించారు. ఈ సీరియల్‌లో తన నటనకు ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2009లో ప్రసారమైన ఈ సీరియల్‌ సెకండ్‌ సీజన్‌ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు