ఓ ఇంటివాడైన మలయాళ నటుడు

22 Jun, 2021 12:12 IST|Sakshi

మలయాళ నటుడు అర్జున్‌ నందకుమార్‌ ఓ ఇంటివాడయ్యాడు. దివ్య పిళ్లై అనే యువతిని వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. కరోనా విజృంభణ కారణంగా సోమవారం జరిగిన ఈ వివాహానికి ఇరు కుటుంబాలతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కోవిడ్‌ నియమ నిబంధనలు పాటిస్తూ ఈ తంతును పూర్తి చేశారు.

కాగా అర్జున్‌ నటుడు మాత్రమే కాదు క్రికెటర్‌ కూడా! అతడు 'కేసనోవా' చిత్రంతో నటనారంగంలోకి అడుగుపెట్టాడు. మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటించిన 'గ్రాండ్‌మాస్టర్‌' చిత్రంలోని నెగెటివ్‌ రోల్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'షైలాక్‌', 'సుసుసుధి వాత్మికం', 'ద డాల్ఫిన్స్‌', '8.20', 'రేడియో జాకీ' వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. అర్జున్‌ ముఖ్య పాత్రలో నటించిన 'మరక్కార్‌: అరేబికదలంటే సింహం' సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుంది.

చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్‌

కమెడియన్‌ మొండితనం, దర్శకుడికి రూ.2 కోట్ల నష్టం!

మరిన్ని వార్తలు