హాస్య నటుడి పరిస్థితి విషమం.. సాయం కోసం వేడుకోలు

22 Sep, 2022 15:03 IST|Sakshi

హాస్య నటుడు బోండామణికి రెండు మూత్ర పిండాలు దెబ్బతినడంతో చెన్నై, ఓమందూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన సహనటుడు బెంజిమన్‌ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. శ్రీలంకకు చెందిన బోండామణి వయసు (59). చాలా కాలం క్రితమే బతుకుతెరువు కోసం చెన్నైకు చేరుకున్నారు. అలా 1991లో కె.భాగ్యరాజ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన పవుణు పవుణుదాన్‌ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు.

తరువాత కొన్ని చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేశారు. సుందర్‌ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం, జిల్లా వంటి పలు చిత్రాలలో మంచి గుర్తింపు పొందారు. 2019లో నటించిన తనిమై ఈయన చివరి చిత్రం కగా ఈ ఏడాది మే నెలలో గుండె సంబంధిత సమస్యతో ఓమందూర్‌ ఆసుపత్రిలో చేరి మూడు నెలలకు పైగా అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు.

కాగా ప్రస్తుతం రెండు మూత్రపిడాలు దెబ్బతినడంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. నటుడు బెంజిమెన్‌ విడుదల చేసిన వీడియోలో నటుడు బోండామణికి రెండు మూత్ర పిండాలు దెబ్బతినడంతో ప్రాణాలతో పోరాడుతున్నారని, వైద్య ఖర్చుల కోసం చేతనైనా సాయం అందించాలని కోరారు. కాగా సమాచారం మేరకు ఆయనకు ప్రభుత్వం తరపున రక్తాన్ని ఎక్కిస్తున్నట్లు తెలిసింది.   

చదవండి: (చాలా గ్యాప్‌ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న స్టార్‌ డైరెక్టర్‌)

మరిన్ని వార్తలు