Brahmaji: అతని దెబ్బకు నేను రిటైర్ అయిపోతే బెటర్: బ్రహ్మజీ

9 Oct, 2023 08:19 IST|Sakshi

టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో దాదాపు వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలో విహాన్ తెరకెక్కించిన 'హ‍్యాంగ్ మాన్' చిత్రంలో  ఖైదీలను ఉరి తీసే వైవిధ్యమైన తలారి పాత్రను పోషించారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు మోసాలు చేస్తున్నారంటూ అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రహ్మజీ చేసిన మరో ట్వీట్‌ తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: 'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు')

 ఇటీవల నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో పిల్లల చదువుల గురించి నవీన్ మాట్లాడే సీన్‌ అందరికీ బాగా కనెక్ట్ అయింది. అంతే ఈ సీన్ ట్విట్టర్‌లో చూసిన బ్రహ్మజీ సైతం ఫిదా అయ్యారు. పోలిశెట్టి నటన చూస్తే నాకు భయమేస్తోంది.. ఇక నేను రిటైర్ అయిపోతా అంటూ ఫన్నీ పోస్ట్ చేశారు. దీనికి నవీన్ సైతం 'మీకు పవర్ ఉంది.. నాకు బ్రెయిన్‌ ఉంది.. మనిద్దరం కలిస్తే' అంటూ ఫన్నీగానే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ ట్వీట్ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు