రూ. 4.65 కోట్ల ప్రైజ్‌ మనీ గెలుచుకున్న బ్రహ్మాజీ!.. ట్వీట్‌ వైరల్‌

18 Jun, 2021 18:44 IST|Sakshi

నటుడు బ్రహ్మాజీ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీవీ షోలలో, కార్యక్రమాలలో ఆయన వేసే కామెడీ పంచ్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక బ్రహ్మాజీ సోషల్‌ మీడియాలో​ సైతం పలు సంఘటనలపై తనదైన స్పందిస్తూ చమత్కరిస్తుంటాడు. తాజాగా ఆయన ప్రైజ్‌ మనీ గెలుచుకున్నట్లు వచ్చిన మెసెజ్‌ను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అయితే ఈ ప్రైజ్‌మనీని తీసుకురావాల్సింది హైదరాబాద్‌ సిటీ పోలీసులను, సైబరాబాద్‌ పోలీసులను కోరుతూ ఆయన చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా మనలో చాలా మంది మీరు ఇంత డబ్బును గెలుచుకున్నారంటూ మీ పేరు, చిరునామా ఇవ్వాల్సిందిగా గుర్తుతెలియని ఫోన్‌ నెంబర్‌ నుంచి తరచూ మనకు మెసెజ్‌లు వస్తూనే ఉంటాయి.

అయితే గురువారం బ్రహ్మజీకి ఈ మెసెజ్‌ రావడంతో వెంటనే దానిని స్క్రీన్‌ షాట్‌ తీసి ట్వీటర్‌లో షేర్‌ చేశాడు. ఆ ఫోన్‌ నెంబర్‌ ట్వీట్‌లో పేర్కొంటూ ‘సార్‌ నాకు ఈ నెంబర్‌ నుంచి రూ.4.65 కోట్లు లాటరీ తగిలిందని యూకేకు చెందిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి మెసెజ్‌ వచ్చింది. దయ చేసి మీరు ఈ డబ్బులను తీసుకురాగలరు’ అంటూ సిటీ పోలీసులు, సైబరాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేశాడు. ఇక బ్రహ్మజీ చమత్కారంగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చూసి నెటిజనలు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయన తీరుపై ప్రశంసలు కురిపిస్తూ తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: 
పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్‌ 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు