'ఖైదీ' నటుడి అకాల మరణం

29 Dec, 2020 07:57 IST|Sakshi

చెన్నై: తమిళ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అరుణ్‌ అలెగ్జాండర్‌ కన్నుమూశారు. సోమవారం నాడు ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. 48 ఏళ్ల వయసులోనే ఆయన మృత్యువాత పడటం చిత్రసీమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయ‌న మృతికి అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. "ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతావని ఊహించలేదు. దుఃఖం ఆగట్లేదు. నీ లోటును ఎవరూ పూడ్చలేరు. నా గుండెలో ఎప్పటికీ నువ్వు పదిలంగా ఉంటావు" అంటూ దర్శకుడు కనగరాజ్‌ ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు. కాగా అరుణ్‌ అలెగ్జాండర్‌ 'కోలమావు కోకిల', 'బిగిల్'‌, 'ఖైదీ', 'మాస్టర్'‌ వంటి చిత్రాల్లో నటించారు. ఆయన చివరిసారిగా నటించిన 'మాస్టర్'‌ సినిమాలో స్టార్‌ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో నటించగా ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది. (చదవండి: విషాదం: ప్రముఖ నటుడు దుర్మరణం)

(చదవండి: జీఎస్‌టీ టీజర్‌ బాగుంది)

మరిన్ని వార్తలు