Duniya Vijay: సినిమా చూడకుండానే అమ్మ చనిపోయారు.. ఆ బాధ వెంటాడుతోంది

8 Jan, 2023 19:40 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు దునియా విజయ్‌. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా తల్లిదండ్రులే నా దేవుళ్లు. వారి ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్‌కు ముందు అమ్మానాన్న ఇద్దరూ చనిపోయారు. ఈ సినిమా చూడకుండానే నా తల్లి మరణించారన్న బాధ ఉంది.

దునియా సినిమా మధ్యలో ఆగిపోతే నేను రూ.12 లక్షలు ఇచ్చాను. అప్పుడు ఇంట్లోవాళ్లతో గొడపడి మరీ ముందడుగు వేశాను. చివరికి సినిమా సూపర్‌ హిట్‌ కావడమే కాక నా ఇంటి పేరుగా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను. కానీ తెలుగులోకి రావడానికి చాలాకాలం పట్టింది. మొదట తెలుగులో లవకుశ సినిమా ఆఫర్‌ వచ్చింది కానీ అప్పుడు కన్నడలో బిజీ ఉండి చేయలేకపోయాను. తర్వాత గోపీచంద్‌ మలినేని వీరసింహారెడ్డి సినిమా గురించి సంప్రదించాడు. ముసలిముడుగు ప్రతాప్‌రెడ్డి రోల్‌ చేయాలన్నారు. ఆ రోల్‌ గురించి చెప్పగానే ఓకే చెప్పేశా. ఎప్పుడెప్పుడు పాత్ర చేయాలా? అని ఎదురుచూశాను. సినిమా అదిరిపోతుంది' అని చెప్పుకొచ్చాడు దునియా విజయ్‌.

చదవండి: ఆ పాట, ఆ సన్నివేశం నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌: రాజమౌళి

మరిన్ని వార్తలు