బిల్డింగ్‌పై నుంచి పడిపోయిన స్టార్‌ హీరోయిన్‌ భర్త

4 Mar, 2021 11:08 IST|Sakshi

వెంటనే ఆసుపత్రికి తరలింపు

ఆసుపత్రికి చేరుకున్న నజ్రియా నజీమ్‌

ప్రముఖ మలయాళ నటుడు, హీరోయిన్‌ నజ్రియా నజీమ్‌ భర్త ఫాహద్ ఫాసిల్ షూటింగ్‌లో గాయపడ్డారు. కొచ్చిలో 'మలయన్కుంజు' సినిమా చిత్రీకరణ సమయంలో బిల్డింగ్‌ పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం జరిగింది. బ్యాలెన్స్‌ అదుపుతప్పి నటుడు బిల్డింగ్‌పై నుంచి పడిపోయినట్లు సమాచారం. దీంతో వెంటనే ఆయన్ను కొచ్చిలోని ఓ ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌కి త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు బలమైన గాయం కాగా, కొన్ని స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, పూర్తి బెడ్‌ రెస్ట్‌ అవసరమని పేర్కొన్నారు.


విషయం తెలిసిన వెంటనే ఫాహద్‌ భార్య, నటి నజ్రియా ఆసుపత్రికి చేరుకున్నారు. మరోవైపు తమ హీరో త్వరగా కోలుకోవాలంటూ ఆయన అభిమానులు ప్రార్దిస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో అరడజనుకు పైగా సినిమాల్లో ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. ఆయన 'సూపర్ డీలక్స్‌' సినిమాలో కనిపించారు. 2014లో ఫాహద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నజ్రియా..ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అంజలీ మీనన్‌’ కూడె’ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను స్టార్ట్‌ చేశారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మళయాల భామ నజ్రియా నజీమ్‌. రాజారాణి సినిమాతో తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాని సరసన ‘అంటే సుందరానికీ!’ అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. 

చదవండి : (నజ్రియా నజీమ్‌ ‘వాది’ కమింగ్‌!.. ఎందుకంటే..)
(‘అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న’)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు