నిర్ల‌క్ష్యం వ‌ద్దు.. అంద‌రికి ఒకేలా జ‌ర‌గ‌దు

6 Sep, 2020 13:11 IST|Sakshi

ముంబై : టాలీవుడ్‌.. బాలీవుడ్ అనే తేడా లేకుండా ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా యారియాన్ సినిమా ఫేం హిమాన్ష్‌ కోహ్లి క‌రోనా సోకిందంటూ శుక్ర‌వారం ఇన్‌స్టా ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించాడు. 'ఈ మ‌ధ్య‌నే క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నా.. శుక్ర‌వారం పాజిటివ్ అని తేలింది.. రెండు వారాలు  ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే స‌రిపోతుందని డాక్ట‌ర్లు చెప్పారు. ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నా.. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి' అంటూ కామెంట్ చేశాడు.

అంతేకాదు క‌రోనాను నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని.. ల‌క్ష‌ణాల‌నేవి అంద‌రికి ఒకేలా ఉండ‌వంటూ ఒక సుధీర్ఘ పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేశాడు. హిమాన్ష్ కుటుంబంలో మొద‌ట త‌న తండ్రి, త‌ల్లితో పాటు చెల్లికి క‌రోనా సోకింది. వారంద‌రూ హోం ఐసోలేష‌న్‌లో ఉండ‌గానే ఇప్పుడు హిమాన్ష్ కూడా క‌రోనా పాజిటివ్ అని తేలింది. హిమాన్ష్‌ కోహ్లి రాసిన సారాంశం ఇలా ఉంది. (చదవండి : అరెస్టు అయ్యేందుకు సిద్ధం.. ప్రేమించడం నేరం కాదు!)

'భ‌గ‌వంతుడి ద‌య వ‌ల్ల , మీ అంద‌రి ప్రార్థ‌నల కార‌ణంగా నా కుటుంబం ఇప్పుడిప్పుడే క‌రోనా నుంచి కోలుకుంటుంది. తాజాగా నేను క‌రోనా బారిన ప‌డ్డాను. క‌రోనా సోక‌క‌ముందు మేము చాలా దైర్యంగా ఉన్నాం.. ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఉందిగా.. మాకేం కాదులే.. క‌రోనాతో పోరాడుతుందిలే అని భావించేవాళ్లం దాంతో పాటు క‌రోనా రాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునేవాళ్లం. కానీ మా అమ్మ, నాన్న‌, చెల్లికి క‌రోనా సోకిన త‌ర్వాత  ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వారిలో ఏ ఒక్క‌రికి ఒకే ర‌క‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపించ‌లేదు. వారి ప‌రిస్థితి చూసి నేను టెస్ట్‌కు వెళితే  క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

అందుకే ఇప్పుడు మీకు ఒక విష‌యం చెప్పాల‌నుకుంటున్నా.. ద‌య‌చేసి క‌రోనా ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ఉండ‌కండి.. మాకేం కాదులే అన్న ధోర‌ణి వ‌దిలేయండి.. ల‌క్ష‌ణాలు అనేవి అంద‌రికి ఒకేలా క‌నిపించ‌డం లేదు. నేను ఏదో భ‌య‌పెట్టాల‌ని మాత్రం చెప్ప‌ట్లేదు.. నేను నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించానే కాబ‌ట్టే  ఇప్పుడు ఫ‌లితం అనుభ‌విస్తున్నా.. మీకు ఆ ప‌రిస్థితి రాకూడ‌ద‌నే కోరుకుంటూ ఇదంతా చెప్పా. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి.. స్టే సేఫ్‌.. బి హ్యాపీ.. అంటూ 'రాసుకొచ్చాడు.

కాగా 2014లో యారియాన్‌ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హిమాన్ష్ కోహ్లి ఆ త‌ర్వాత రాంచీ డైరీస్‌, అభీ న‌హీ తోహ్ క‌బీ న‌హీ, బూందీ ర‌హితా, దిల్ జోనా కెమ్ సాకా వంటి చిత్రాలో న‌టించాడు. బాలీవుడ్ సింగ‌ర్ నేహా క‌క్క‌ర్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన హిమాన్ష్ .. గ‌తేడాది వారిద్ద‌రి మ‌ద్య జ‌రిగిన‌ బ్రేక‌ప్‌తో ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచాడు.

మరిన్ని వార్తలు