అవును.. మాకు క‌రోనా సోకింది

17 Oct, 2020 14:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: న‌టుడు జీవితా రాజ‌శేఖ‌ర్ కుటుంబ సభ్యులు క‌రోనా మహమ్మారి బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. త‌న‌తో పాటు భార్య జీవిత‌, పిల్ల‌లు శివానీ, శివాత్మిక‌ల‌కు క‌రోనా సోకిన విష‌యం నిజ‌మేన‌ని, ప్ర‌స్తుతం ఆస్పత్రి‌లో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. ‘పిల్లలిద్ద‌రూ పూర్తిగా కోలుకున్నారని.. జీవిత,‌ తాను మాత్రం ఇంకా వైద్యుల సంర‌క్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం మా ఇద్ద‌రి ఆరోగ్యం బాగానే ఉంది. త్వ‌ర‌లోనే ఇంటికి వెళ్తామంటూ’ ట్వీట్ చేశారు.  హిందీ ‘2 స్టేట్స్‌’ తెలుగు రీమేక్‌లో  శివానీ న‌టిస్తుండ‌గా, విష్ణు విశాల్‌ హీరోగా వెంకటేశ్‌ దర్శకత్వంలోనూ క‌థానాయిక‌గా ఛాన్స్ కొట్టేశారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా శివానీ ప‌రిచ‌యం కానుంది. ఇక నూతన దర్శకుడు దుర్గానరేశ్‌ గుట్ట డైరెక్షన్‌లో ‘విధివిలాసం’ సినిమాలో శివాత్మిక న‌టిస్తుంది. ఈ సినిమాలో అరుణ్‌ అదిత్ జోడిగా ఆమె క‌నిపించ‌నున్నారు. (ఇంటికి చేరుకున్న హీరోయిన్‌.. ఆత్మీయ స్వాగతం)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు