Actor Jiiva: యాంకర్‌గా మారిన హీరో జీవా.. త్వరలోనే 'ఆహా'లో స్ట్రీమింగ్‌

13 Sep, 2022 10:40 IST|Sakshi

తమిళ సినిమా: కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జీవా. ఇటీవల ఈయన యాంకర్‌ అవతారం ఎత్తారు. సర్కార్‌ విత్‌ జీవా పేరుతో ఆహా ఓటీటీ సంస్థ నిర్వహిస్తున్న రియాల్టీ షోకు ఈయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. వారానికి నలుగురు సెలబ్రెటీలతో నో రూల్స్‌ అనే ట్యాగ్‌తో సాగే ఈ షోలో జీవా చేసే సందడి ఈనెల 16వ తేదీ నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇది తెలుగులో బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమైన అన్‌ స్టాపబుల్‌ షో తరహాలో కాకుండా తమిళంలో కొంచెం భిన్నంగా మరింత ఎంటౖర్‌టైన్మెంట్‌తో  కూడి ఉంటుందని ఆహా నిర్వాహకులు సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

నటుడు జీవా మాట్లాడుతూ.. అందరూ ఎస్‌ఎంఎస్‌ చిత్రంలో జీవాను మళ్లీ ఎప్పుడు చూస్తాము అని అడుగుతున్నారని.. అయితే ఈ రియాల్టీ షోలో ప్రేక్షకులు తనను ఆ విధంగా చూడవచ్చని, అదేవిధంగా ఆసక్తికరమైన అంశాలు ఈ షోలో ఉంటాయని తెలిపారు. సెలబ్రిటీల అంతరంగ విషయాలతో పలు ఆసక్తికరమైన వినోదాన్ని అందించే అంశాలు ఉంటాయన్నారు. ప్రేక్షకులను అలరించడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇక్కడ ఆడేది సెలబ్రిటీలు అని ఆడించేది తాను అని జీవా పేర్కొన్నారు. ఈ సందర్భంగా సపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించే 100వ చిత్రంలో నటుడు విజయ్‌ హీరోగా నటిస్తారా అన్న ప్రశ్నకు కచ్చితంగా ఆయనే నటిస్తారని చెప్పారు. దీనికి సంబంధించి విజేత చర్చలు కూడా జరుగుతున్నట్లు, ఆ చిత్రంలో తాన విజేత చర్చలు కూడా జరుగుతున్నట్లు, ఆ చిత్రంలో తానూ ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు