కైకాల సత్యనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స

21 Nov, 2021 21:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు ఆదివారం సాయంత్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. కైకాల స్పృహలోనే ఉన్నారని, ఆయనకు చికిత్స కొనసాగుతోందని అపోలో వైద్యులు తెలిపారు. అయితే ఇంకా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వివరించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బీపీ లెవల్స్‌ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
చదవండి: కొడుకుని ప్రేమతో ముద్దాడిన ఎన్టీఆర్‌.. వైరలవుతోన్న ఫోటో

కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు. కాగా గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడటంతో నొప్పులు ఎక్కువగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.

మరిన్ని వార్తలు