Raja Vikramarka: ఏజెంట్‌ విక్రమ్‌ రెడీ

20 Oct, 2021 23:35 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. దర్శకుడు వీవీ వినాయక్‌ శిష్యుడు శ్రీ సరిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌గా నటించారు. ఆదిరెడ్డి. టి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబర్‌ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా  ‘88’ రామారెడ్డి మాట్లాడుతూ – ‘‘యాక్షన్, కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.

కార్తికేయ లేకుండా ఈ సినిమాను ఊహించలేం. ఏజెంట్‌ విక్రమ్‌ పాత్రలో ఆయన జీవించారు. శ్రీ సరిపల్లికి తొలి సినిమా అయినా బాగా తీశాడు’’ అన్నారు. శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘ఎన్‌ఐఏ ఏజెంట్‌ విక్రమ్‌ పాత్రలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారు. న్యూ ఏజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో కార్తికేయ లుక్‌ బాగుంటుంది. స్క్రీన్‌ ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు