నటి కీర్తి రెడ్డి బాబాయ్‌ కన్నుమూత

14 May, 2021 17:24 IST|Sakshi

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి, సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాతపడుతున్నారు. కొంతమందిని కరోనా బలితీసుకుంటే మరికొంత మంది అనారోగ్యంతో కన్నుమూస్తున్నారు. తాజాగా.. పవన్‌ కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ సినిమాలో నటించిన నటి కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె బాబాయ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు  కేశ్‌పల్లి (గడ్డం) ఆనందరెడ్డి(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గుండెనొప్పితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్‌లో అడ్మిట్‌ అయిన కొంత సమయానికే ఆయన తుదిశ్వాస విడిచారు.

ఆనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి తనయుడు. మొదట యూత్ లీడర్‌గా పని చేసిన ఆయన.. 2014లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా కీర్తిరెడ్డికి 2004లో హీరో సుమంత్‌తో వివాహం జరగ్గా 2006లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అనంతరం కీర్తి మరో పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడ్డారు. ఇక తన బాబాయ్‌ మరణవార్త విని ఆమె హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది.

చదవండి: 
బాలయ్యను చూసి ఆశ్చర్యపోయా : ప్రగ్యా జైస్వాల్
ఆ హీరోయిన్స్‌తో పోలుస్తూ నన్ను అవమానించేవారు: హీరోయిన్‌

మరిన్ని వార్తలు