టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కృష్ణ బూరుగుల 

9 Jul, 2022 13:59 IST|Sakshi

దర్శకుడు రవిబాబు తెలుగు ఇండస్ట్రీకి చాలా మంది నటులను పరిచయం చేశారు. అందులో అల్లరి నరేశ్‌, విజయదేవరకొండ లాంటి వారు మంచి నటులుగా నిరూపించుకొని స్టార్స్‌ అయ్యారు. మరికొంత మందికి స్టార్‌ ఇమేజ్‌ రాకున్నా..ఇండస్ట్రీలో మాత్రం మంచి పేరు సంపాదించుకొని వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా రవిబాబు పరిచయం చేసిన మరో నటుడు కృష్ణ బూరుగుల కూడా టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నాడు. రవిబాబు ‘క్రష్‌’సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు కృష్ణ. తొలి చిత్రంతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరకెక్కించిన ‘మా నాన్న నక్సలైట్‌’తో మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కృష్ణ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ సమర్పణలో  సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ  చిత్రం లో  రెండవ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే  దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ సమర్పణలో వస్తున్న ఎ టి ఎం (ATM) అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఎగ్జీకుటీవ్ ప్రొడ్యూసర్ కృష్ణ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లు మొదలుపెట్టనున్నాడు.

మరిన్ని వార్తలు