ఈ నటుడిని గుర్తుపట్టారా? హీరోగా రెండు సినిమాల్లో నవ్వించాడు!

10 Sep, 2021 18:17 IST|Sakshi

తెరపై కనువిందు చేసే తమ అభిమాన నటీనటులు, హీరోహీరోయిన్లు చిన్నతనంలో, యుక్త వయసులో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు దొరికిన సెలబ్రిటీల ఫొటోలను ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వదులుతున్నారు. దీంతో ఈ మధ్య సెలబ్రిటీలకు సంబంధించిన పలు పాత ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. 

ఇటీవల హీరోయిన్‌ రష్మిక మందన్నా, సాయి పల్లవి, అంజలి, నిహారిక కొణిదెల, నాగార్జున ఇలా పలువురు స్టార్‌ హీరో హీరోయిన్ల ఫొటోలు బయటకు వచ్చాయి.  ఈ నేపథ్యంలో మరో నటుడి త్రోబ్యాక్‌ పిక్‌ ఒకటి ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. అయితే ఈ నటుడు ఎవరో గుర్తుపట్టలేక నెటిజన్లు తంటాలు పడుతున్నారు. కొందరూ గుర్తు పట్టినప్పటికీ వారికి కూడా స్పష్టత రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ హీరో అంతగా ఛేంజ్‌ అయ్యాడు. ఇంతకి ఆ అతడేవరో మీరైనా గుర్తుపట్టారా? లేదా?.. అయితే ఆ నటుడు, హీరో ఎవరో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. 

పూల చొక్కా, నీట్‌గా క్రాఫ్‌ చేసుకుని స్టైల్‌గా ఫొటోకు ఫోజు ఇచ్చిన ఈయన ఎవరో కాదు నటుడు కృష్ణుడు. హీరో లాంటి లుక్‌, కండలు లేకపోయినా వినాయకుడి, విలేజ్‌లో వినాయకుడు వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించిన కథానాయకుడు అతడు. అంతేగాక పలు సినిమాల్లో సహా నటుడిగా, హీరోలకు స్నేహితుడిగా కూడా నటించాడు. ఇక బొద్దుగా తన అమాయాకపు మాటలతో తెరపై హీరోయిన్స్‌ను పడగొట్టిన కృష్ణుడిని ఇలా చూసి నెటిన్లంతా షాక్‌ అవుతున్నారు. దీంతో అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడంటూ తమ స్పందనను తెలుపుతున్నారు.

అయితే అప్పుడు అంత సన్నగా హీరో లుక్‌లో ఉన్న కృష్ణుడు ఓ యాక్సిండెంట్‌ తర్వాత వాడిన మందుల సైడ్‌ ఎఫెక్ట్‌  కారణంగా ఇలా బొద్దుగా మారాడట. కృష్ణుడు సొంతూరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజోలు. సినిమాల్లో ఆడిషన్స్‌కు కోసం  రాజోలులోని ఓ ఫొటో స్టూడియోలో తీయించుకున్న ఫొటో ఇది. యుక్త వయసులో సినిమాలకు రాకముందు హీరోలుక్‌లో ఉన్న కృష్ణుడు అవకాశాలు దొరికి సినిమాల్లోకి వచ్చేసరికి  ఆయన శరీరాకృతిలో భారీ మార్పులు వచ్చాయి.

చదవండి: 
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్‌
‘టక్‌ జగదీష్‌’ మూవీ రివ్యూ

A post shared by Alluri Krishnam Raju@ actor (@krishnudu)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు