కమల్‌తో మన్సూర్‌ అలీఖాన్‌ భేటీ

14 Jul, 2021 10:31 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌తో నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మన్సూర్‌ అలీఖాన్‌తో పాటు తమిళ దేశీయ పులిగళ్‌ పార్టీ నాయకులు ఉండడంతో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాము మర్యాద పూర్వకంగానే కమల్‌హాసన్‌ ఇంట్లో కలిసినట్లు మన్సూర్‌ అలీఖాన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు