మహిళ పోస్ట్‌కు నటుడు రిప్లై.. అది అడిగిన క్షణాల్లోనే..!

28 Feb, 2023 21:01 IST|Sakshi

కన్నుమ్ కన్నుమ్, విమల్ పులివాల్ వంటి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన మరిముత్తుకు  పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఆతను పూర్తిస్థాయి నటుడిగా మారిపోయాడు. జీవా, పరియేరుమ్ పెరుమాళ్, కొంబన్ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం సీరియల్స్‌లోనూ నటిస్తున్నారు. ముఖ్యంగా తిరుచెల్వం దర్శకత్వం వహించిన కౌంటర్-స్విమ్మింగ్ సీరియల్‌లో అతని పాత్ర  మంచి గుర్తింపు వచ్చింది. అలా నటనలో దూసుకెళ్తున్న మరిముత్తు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. అంతే కాకుండా ప్రముఖ దర్శకులైన వసంత్, ఎస్.జె.సూర్య, మణిరత్నం, సీమాన్ వద్ద సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 

సోషల్ మీడియాలో ఓ మహిళ నేను మీకు కాల్ చేయొచ్చా అంటూ ఓ క్యాప్షన్ పెట్టింది. ‍అరకొర దుస్తులు ధరించిన ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన నటుడు మరిముత్తు వెంటనే ట్విటర్‌ ఖాతాలో రిప్లై ఇచ్చారు. అందులో ఏకంగా తన మొబైల్ నంబర్ కూడా పెట్టారు. ఇది చూసిన నెటిజన్స్ షాక్ తిన్నారు. ఆ తర్వాత నంబర్‌ ట్రూ కాలర్‌లో చెక్‌ చేశారు.

ఆయనదే కావడంతో ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మరిముత్తు తనయుడు అఖిలన్ వివరణ ఇచ్చాడు. ఆ పోస్ట్ చేసింది మా నాన్న కాదని చెప్పారు. ఎవరో కావాలనే అలా చేశారని అన్నారు. మా నాన్న నంబర్ చాలామందికి తెలుసని.. అందుకే ఎవరో దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.  తన వివరణ తర్వాత ఆ నకిలీ రికార్డును తొలగించారు.    

మరిన్ని వార్తలు