కరోనా టీకా వేయించుకున్న అక్కినేని నాగార్జున

17 Mar, 2021 15:45 IST|Sakshi

కరోనా వైరస్‌కు విరుగుడుగా తీసుకువచ్చిన టీకా పంపిణీ దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణలోనూ విస్తృతంగా టీకాల పంపిణీ జరుగుతోంది. రెండో దశలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు టీకాను పొందుతున్నారు. తాజాగా టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున కూడా టీకా వేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం నాగార్జున టీకా మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని నాగ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

‘నిన్న నేను కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ తీసుకున్నా. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాలి. దీనికోసం ఆన్‌లైన్‌ http://cowin.gov.in రిజిస్టర్‌ చేసుకుని టీకా వేయించుకోవాలి’ అని నాగార్జున సూచించారు. నాగార్జున కోవాగ్జిన్‌ టీకాను వేసుకున్నారు. ఈ సందర్భంగా #Unite2FightCorona, #VaccineVarta, @MoHFW_India, @BMGFIndia అనే హ్యాష్‌ట్యాగ్‌, ట్యాగ్‌లు ఇచ్చి టీకా వేసుకుంటున్న ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు