Nagarjuna Brahmastra Movie: వారివల‍్లే మెంటల్లీ బరువు  తగ్గిపోయింది.. నాగార్జున

14 Sep, 2022 10:13 IST|Sakshi

‘‘చాలామంది సినిమా చచ్చిపోతోందని అంటున్నారు. కానీ సినిమా పెరుగుతోందనేది నా అభిప్రాయం. అలాగే క్వాలిటీ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్, పోటీ కూడా పెరిగిపోతోంది. ట్రెండ్‌కి తగ్గట్టు యాక్టర్స్, డైరెక్టర్స్‌ అప్‌డేట్‌ అవుతుండాలి. దర్శక–నిర్మాతల మధ్య కథ గురించి లోతైన చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు ఇప్పుడు డిఫరెంట్‌ కథలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రీగా చూపిస్తామన్నా సినిమాలను చూసేందుకు కొంతమంది ప్రేక్షకులు ఇష్టపడరేమో!’ అన్నారు నాగార్జున

 రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాలజీ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1శివ’ ఈ నెల 9న రిలీజ్‌ అయ్యింది. దక్షిణాదిలో ‘బ్రహ్మాస్త్రం’గా దర్శకుడు రాజమౌళి సమర్పణలో ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలు  నాగార్జున మీడియాతో పంచుకున్నారు.. 

‘బ్రహ్మాస్త్రం’లో నా క్యారెక్టర్‌ పరంగా హ్యాపీగా ఉన్నాను. అయాన్ ముఖర్జీ నాతో ఏం చెప్పాడో అదే తీశాడు. నా క్యారెక్టర్‌కు మంచి అప్లాజ్‌ వచ్చింది. నాకీ సినిమా కథ చెప్పినప్పుడే మూడు భాగాలని చెప్పారు. సెకండ్, థర్డ్‌ పార్ట్స్‌లో నా పాత్ర  ఉంటుందా? లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. మంచి క్యారెక్టర్స్‌ కంటిన్యూ  అవుతాయనే అనుకుంటున్నాను. 

(చదవండి:  కెమెరా ముందు మెరీనా, రోహిత్‌ ముద్దులు... ‘అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలి’)

ఇంట్రవెల్‌ సీక్వెన్స్ తర్వాత సినిమా కాస్త నెమ్మదించిందేమో! అయితే మిగతా రెండు భాగాలకు లింక్‌ అయినట్లు కనిపించే ఈ సీన్స్ వల్లే పార్ట్‌ 2 చూడాలనే కుతూహలం ఆడియన్స్‌లో కలిగింది. నంబర్స్‌ గురించి ఆలోచించడం మానేశానని ఎన్నోసార్లు చెప్పాను. కానీ అప్‌డేట్‌ అవుతూ ఉండాలని మాత్రం తెలుసు. నేను ఆల్మోస్ట్‌ 38 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇప్పటికీ నా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే అది చాలు నాకు. నాకు మెంటల్లీ బరువు తగ్గిపోయింది.

నా నెక్ట్స్‌ మూవీ ‘ది ఘోస్ట్‌’ అక్టోబరు 5న విడుదలవుతుంది. ‘గరుడ వేగ’ చూసి, ప్రవీణ్‌ సత్తారుతో సినిమా చేయాలనుకున్నాను. అది ‘ఘోస్ట్‌’తో కుదిరింది. ఈ సినిమా కోసం నేను వెపన్ ట్రైనింగ్, మార్షల్‌ ఆర్ట్స్‌లో కొంత శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు బ్రదర్స్, సిస్టర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ డాటర్‌ సెంటిమెంట్‌ కూడా ఉంది. నా వందో సినిమా కోసం దర్శకుల దగ్గర కథలు వింటున్నాను. కొంచెం ప్రతిష్టాత్మకంగా చేయాలనుకుంటున్నాం.

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ తర్వాత మళ్లీ ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో అమల యాక్ట్‌ చేసింది. అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజీ, బ్లూ క్రాస్‌లతో అమల బిజీగా ఉండటంతో నచ్చిన క్యారెక్టర్‌ వచ్చినప్పుడు మాత్రమే చేస్తోంది. ‘ఒకే ఒక జీవితం’ చూసినప్పుడు మా అమ్మగారు గుర్తొచ్చి ఎమోషనల్‌ అయ్యాను. సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ ట్రెండ్‌ అనేది ఇండస్ట్రీపై అంతగా ప్రభావం చూపిస్తోందని నేను అనుకోవడం లేదు.

‘లాల్‌సింగ్‌ చడ్డా’ ఆడలేదు. కానీ ‘బ్రహ్మాస్త్రం’ ఆడింది. ఈ సినిమా కంటే ముందు వచ్చిన ‘గంగూబాయి కతియావాడి’, ‘భూల్‌ భులయ్యా 2’, ‘జుగ్‌ జుగ్‌ జీయో’ చిత్రాలతో పాటు మన సౌత్‌ చిత్రాలు రీసెంట్‌గా ‘కార్తికేయ 2’, గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌ 2’, ‘పుష్ప’ వంటివి హిందీలో బాగానే ఆడాయి.సినిమా బాగుంటే ఆడుతుంది. అలాగే ఏ ఇండస్ట్రీ వారు మరో  ఇండస్ట్రీ వారిని సర్‌ప్రైజ్‌ చేయడం అనేది సాధ్యపడదని నా ఫీలింగ్‌. ఒకప్పుడు మనల్ని మద్రాసి అనేవారు. ఇప్పుడది పోయింది. 

మరిన్ని వార్తలు