కాంగ్రెస్‌ విజయంపై నాని ఫన్నీ కామెంట్‌.. ఆపై తారక్‌ ఫోటో పోస్ట్‌

5 Dec, 2023 08:20 IST|Sakshi

నాని  హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రం 'హాయ్‌ నాన్న'. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బేబీ కియారా, శ్రుతిహాసన్‌, ప్రియదర్శి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో  పోషించారు. డిసెంబరు 7న సినిమా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. 

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన నెటిజన్లతో ముచ్చటించాడు. వారందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ నేపధ్యలోనే ఒక నెటిజెన్ తెలంగాణ ఎన్నికల గురించి ప్రశ్న అడిగాడు. 'తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు కదా. మరి వచ్చిన ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అంటూ ప్రశ్నించాడు.

దీనికి నాని బదులిస్తూ.. 'పదేళ్లు ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూశాము. ఇప్పుడు థియేటర్‌లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాము.' అని తనదైన స్టైల్లో నాని చెప్పడం విశేషం. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదే క్రమంలో  ఎన్టీఆర్ అభిమాని ఒకరు ఇలా అన్నాడు. 'తారక్ అన్నతో మీరు కలిసి ఉన్న ఓ అరుదైన ఫోటోని షేర్ చేయండి.' అంటూ కోరాడు.  దీంతో నాని కూడా వెంటనే రియాక్ట్‌ అయ్యాడు. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఒక అరుదైన ఫోటోని ఆ అభిమాని కోసం షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోను తారక్‌ అభిమానులతో పాటు నాని ఫ్యాన్స్‌ కూడా  నెట్టింట షేర్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు