‘కృష్ణగారి ఆరోగ్యం నిలకడగా ఉంది.. ఆందోళన అవసరం లేదు’

14 Nov, 2022 12:06 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆరోగ్యంపై సీనియర్‌ నటుడు నరేశ్‌ సోమవారం ఉదయం స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోటిన్‌ చెకప్‌లో భాగంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్లు నరేశ్‌ పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

చదవండి: సూపర్‌ స్టార్‌ కృష్ణకు అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక

కాగా కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు