హోటల్‌లో నరేశ్‌, పవిత్ర జంట.. చెప్పుతో కొట్టబోయిన రమ్య

3 Jul, 2022 11:36 IST|Sakshi

Actor Naresh And Pavitra Lokesh: సినియర్‌ నటుడు నరేశ్‌, పవిత్ర లోకేష్‌ జంట  మైసూర్‌లో ప్రత్యేక్షమైంది. మైసూర్‌లోని ఓ హోటల్‌ ఉన్న ఈ జంటను నరేశ్‌ మూడో భార్య రమ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేశ్‌ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. దీనికి  సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

(చదవండి: దయచేసి నాకు, నరేశ్‌కు సపోర్డు ఇవ్వండి..)

గత కొన్ని రోజులుగా నరేశ్‌, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నరేశ్‌ మూడో భార్య రమ్య తెరపైకి వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్‌ను నరేశ్‌ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆరోపించారు.

‘నరేశ్‌ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్‌ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. దీనిపై పవిత్ర లోకేష్‌ కూడా స్పందించారు. రమ్య కావాలనే తనను బ్యాడ్‌ చేస్తున్నారని మండిపడ్డారు.  ఏదైన ఉంటే హైదరాబాద్‌లో మాట్లాడకుండా.. బెంగళూరు వచ్చి నన్ను చెడ్డగా చూపించడం కరెక్ట్‌ కాదన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు