నిఖిల్‌పై సీపీ సజ్జనార్‌ ప్రశంసలు.. శాలువాతో సత్కారం

14 Aug, 2021 11:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హీరో నిఖిల్‌ సిద్దార్థను సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్ సత్కరించారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఎంతోమందికి సహాయం చేసిన నిఖిల్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా నిఖిల్‌కు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం సజ్జనార్‌ నిఖిల్‌తో సరదాగా కాసేపు ముచ్చటించారు. కాగా కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, మందులు సహా అవసరమైన వారికి నిఖిల్‌ చేయూత అందించారు.

ఇదిలా ఉండగా నిఖిల్‌ ప్రస్తుతం 18 పేజెస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు