Nikki Galrani: సినీ నటి ఇంట్లో చోరీ.. ధనుష్‌ అరెస్ట్‌

20 Jan, 2022 06:19 IST|Sakshi

చెన్నై: నటి నిక్కీ గల్రాణి ఇంటిలో చోరీ జరిగింది. బహుభాషా నటి అయిన నిక్కీ గల్రాణి స్థానిక రాయపేటలో నివసిస్తున్నారు. నెల క్రితం కడలూరు జిల్లా విరుదాచలంకు చెందిన ధనుష్‌ (19) అనే యువకుడు ఆమె ఇంట్లో పనికి చేరాడు. ఈనెల 11న అతడు రూ.1.25 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు ధనుష్‌ను అన్నాశాల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

చదవండి: (ఆన్‌లైన్‌ టికెట్ల విధానంలో తప్పేముంది?)

మరిన్ని వార్తలు